Sharmila: సిరిసేడు గ్రామంలో దీక్ష‌కు దిగిన వైఎస్ ష‌ర్మిల‌

Sharmila takes part in  strike
  • ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం-నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష
  • నేడు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ష‌ర్మిల దీక్ష‌
  • ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి షబ్బీర్ కుటుంబానికి  పరామర్శ
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం-నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలో ష‌ర్మిల‌ పాల్గొంటోన్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా, సిరిసేడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

షబ్బీర్‌ తల్లిదండ్రులను ఓదార్చి వారికి అండగా ఉంటామని ష‌ర్మిల‌ భరోసా ఇచ్చారు. అనంతరం ప‌లువురు నేత‌ల‌తో క‌లిసి సిరిసేడులో దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్ష‌ సాయంత్రం 5 గంటల వరకు జ‌ర‌గ‌నుంది. తెలంగాణ‌లో ల‌క్షా 90 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసే వ‌ర‌కు తాను పోరాడుతూనే ఉంటాన‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Sharmila
YSRTP
Telangana

More Telugu News