కొత్త రికార్డ్ సెట్ చేసిన మహేశ్ బర్త్ డే బ్లాస్టర్!

10-08-2021 Tue 10:24
  • నిన్న మహేశ్ బాబు బర్త్ డే
  • స్పెషల్ టీజర్ కి అనూహ్యమైన స్పందన
  • రికార్డు స్థాయిలో వ్యూస్
  • భారీస్థాయిలో లైక్స్    
Sarkaru Vaari Paata teaser update
మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో నిన్న మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి 'బర్త్ డే బ్లాస్టర్' పేరుతో ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.

మహేశ్ బాబు రొమాంటిక్ లుక్ .. లవర్ ను ఫాలో అవుతూ మురిసిపోయే ఎక్స్ ప్రెషన్స్ .. యాక్షన్ సీన్ లో నీట్ గా చెప్పే పవర్ఫుల్ డైలాగ్ .. చివర్లో ఆయన తాలూకు కామెడీ టచ్ .. ఈ టీజర్ కి హైలైట్ గా నిలిచాయి. ఇలా వదలగానే ఈ టీజర్ రాకెట్ లాంచర్ లా దూసుకుపోయింది. 24 గంటల్లోనే 25.7 మిలియన్ వ్యూస్ ను, 754K లైక్స్ ను సాధించింది. టాలీవుడ్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన టీజర్ గా కొత్త రికార్డును సెట్ చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్ .. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో, మహేశ్ కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన బ్యాంకు స్కామ్ అనే అంశం చుట్టూ వినోదభరితంగా తిరిగే కథ ఇది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు.