సూళ్లూరుపేట వైసీపీ కౌన్సిలర్ తాళ్లూరి సురేశ్ దారుణ హత్య

09-08-2021 Mon 19:59
  • కుటుంబ సభ్యుల కోసం రైల్వేస్టేషన్ కి వచ్చిన సురేశ్
  • కారు పార్క్ చేస్తుండగా దాడి
  • కత్తులతో నరికి చంపిన దుండగులు
YCP Councillor murdered in Sullurpet
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దారుణ హత్య జరిగింది. వైసీపీ కౌన్సిలర్ తాళ్లూరి సురేశ్ ను గుర్తుతెలియని దుండగులు నరికి చంపారు. కుటుంబ సభ్యులను రైల్వే స్టేషన్ వద్ద దించేందుకు సురేశ్ కారులో వెళ్లారు. ఆయన రైల్వే గేటు వద్ద కారు నిలుపుతుండగా, దుండగులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. సురేశ్ తనపై దాడి జరుగుతోందని గుర్తించి తప్పించుకునేందుకు యత్నించినా సాధ్యపడలేదు. ఈ ఘటనలో సురేశ్ అక్కడికక్కడే చనిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.