ఏపీలో కొత్తగా 1,413 కరోనా పాజిటివ్ కేసులు

09-08-2021 Mon 17:52
  • గత 24 గంటల్లో 54,455 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 458 కేసులు
  • కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 9 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో 18 కరోనా మరణాలు
  • ఇంకా 19,549 మందికి చికిత్స
AP covid cases and deaths update

రాష్ట్రంలో గత 24 గంటల్లో 54,455 నమూనాలు పరీక్షించగా 1,413 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 458 కొత్త కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 207, చిత్తూరు జిల్లాలో 201 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 9 పాజిటివ్ కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,795 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మరణాలు సంభవించాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,83,721 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,50,623 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,549 మందికి చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,549కి పెరిగింది.