పులిచింత‌ల స‌మీపంలో వ‌రుస‌గా భూప్ర‌కంప‌న‌లు

08-08-2021 Sun 11:33
  • మూడు సార్లు భూప్రకంప‌న‌లు
  • ఈ రోజు ఉద‌యం 7.15 నుంచి 8.20 గంట‌ల మ‌ధ్య భూప్ర‌కంప‌న‌లు
  • భూకంప లేఖినిపై తీవ్ర‌త  3, 2.7, 2.3గా న‌మోదు
earthquake in pulichintala
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పులిచింత‌ల‌లో వ‌రుస‌గా భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. పులిచింత‌ల ప‌రిస‌ర ప్రాంతాల్లో మూడు సార్లు భూప్రకంప‌న‌లు సంభ‌వించిన‌ట్లు అధికారులు ప్రక‌టించారు. ఈ రోజు ఉద‌యం 7.15 నుంచి 8.20 గంట‌ల మ‌ధ్య భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించిన‌ట్లు వివ‌రించారు.

వాటి తీవ్ర‌త భూకంప లేఖినిపై 3, 2.7, 2.3గా న‌మోదైన‌ట్లు చెప్పారు. చింత‌ల‌పాలెం, మేళ్ల చెరువు మండ‌లాల్లోనూ భూప్ర‌కంప‌న‌లు గుర్తించిన‌ట్లు తెలిపారు. పులిచింత‌ల స‌మీపంలో భూప్ర‌కంప‌న‌లు రావ‌డం ఇది తొలిసారి కాదు. పులిచింత‌ల స‌మీపంలో గ‌త వారం రోజులుగా ప‌లుసార్లు భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించిన‌ట్లు భూభౌతిక ప‌రిశోధ‌న శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.