Nara Lokesh: అమరావతి గొప్పతనాన్ని దేశమంతా తెలిసేలా చేసిన రైతులనే అంతిమ విజయం వరించబోతుంది: లోకేశ్‌

lokesh slams ycp
  • అమరావతిని అంతం చేసేందుకు వైకాపా నాయకుల య‌త్నాలు
  • గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కుట్ర‌లు
  • రైతులు ఓర్పుతో ఛేదించారు
  • బెదిరింపులు, అణచివేత, అరెస్టులకు అద‌ర‌రు
జై అమరావతి ఉద్య‌మానికి 600 రోజులు గ‌డుస్తున్న సంద‌ర్భంగా దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. అమ‌రావ‌తి రైతుల‌నే విజ‌యం వ‌రింబోతుంద‌ని అన్నారు.  

'అమరావతిని అంతం చేసేందుకు వైకాపా నాయకులు గల్లీ నుండి ఢిల్లీ వరకూ చేసిన కుట్రలన్నింటినీ రైతులు ఓర్పుతో ఛేదించారు. బెదిరింపులు, అణచివేత, అరెస్టులకు అదరం...బెదరం అంటూ 600 రోజులుగా జై అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభివందనాలు' అని లోకేశ్ పేర్కొన్నారు.

'రోడ్లను సైతం తవ్వేస్తూ అమరావతిని చంపేస్తాం అని ఆనందపడుతున్న వైఎస్ జ‌గ‌న్ గారూ! మీరు తవ్వుకున్న ఆ గుంతల్లోనే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చిపెట్టబోతున్నారు. అవమానాల్ని భరిస్తూనే రాజధాని అమరావతి గొప్పతనాన్ని దేశమంతా తెలిసేలా చేసిన రైతులనే అంతిమ విజయం వరించబోతుంది' అని నారా లోకేశ్ చెప్పారు.
Nara Lokesh
Telugudesam
Amaravati

More Telugu News