KCR: కేసీఆర్ కాన్వాయ్‌కు బైక్‌పై ఎదురెళ్లిన బాలలు.. పోలీసులు ఉరుకులు పరుగులు!

  • కేసీఆర్ సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించి వస్తుండగా ఘటన
  • రూ. 2 వేలకు బైక్‌ను కొనుగోలు చేసిన బాలలు
  • పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
Children riding bike on wrong root as kcr convoy comes

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌కు బైక్‌పై ఎదురెళ్లిన ఇద్దరు బాలలు హడలెత్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. కేసీఆర్ నిన్న సాయంత్రం సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించి వస్తుండగా ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 11, 14 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు బాలలు బైక్‌పై రాంగ్‌రూట్‌లో దూసుకుపోతూ ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు ఎదురెళ్లారు. వారిని పట్టుకున్న పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు.

చిన్నారుల్లో ఒకరిది శాస్త్రిపురంగా, మరొకరు నిలోఫర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. వారు ఆ బైక్‌ను రెండు వేల రూపాయలకు కొనుగోలు చేసి దానిపై తొలుత చార్మినార్‌కు వెళ్లారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్డువైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా, వారు నడిపిన బైక్ చోరీకి గురైనట్టు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. చిన్నారులకు వాహనం అమ్మిన వారి కోసం ఆరా తీస్తున్న పోలీసులు.. బాలల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.

More Telugu News