ఏపీ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 80,376 కరోనా పరీక్షలు
- 1,908 మందికి పాజిటివ్
- తూర్పు గోదావరిలో 438 కేసులు
- కర్నూలు జిల్లాలో 26 కేసులు
- రాష్ట్రవ్యాప్తంగా 23 మరణాలు
అదే సమయంలో 2,103 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,80,258 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,46,370 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 20,375గా నమోదైంది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 13,513కి పెరిగింది.