CBI: సునీల్ యాదవ్ ను పులివెందుల తీసుకువెళ్లిన సీబీఐ అధికారులు

CBI Officials continues probe in Viveka murder case
  • 62వ రోజు సీబీఐ విచారణ కొనసాగింపు
  • వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలపై ఆరా
  • వివేకా ఇంటి సమీపంలోని వాగులో తనిఖీలు
  • వాగులోని నీటిని తరలిస్తున్న అధికారులు
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 62వ రోజు కూడా కొనసాగింది. కస్టడీలోకి తీసుకున్న కీలక నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు పులివెందుల తీసుకువెళ్లారు.

వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం సీబీఐ బృందం ఆరా తీసింది. ప్రస్తుతం పులివెందులలో సునీల్ సమక్షంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయుధాల కోసం వివేకా ఇంటి సమీపంలోని లోతేటి వాగులో తనిఖీలు చేపట్టారు. వాగులోని మడుగుల్లో నిల్వ ఉన్న నీటిని రెండు మున్సిపల్ ట్యాంకర్లతో తరలిస్తున్నారు.

కాగా, ఇవాళ్టి విచారణలో సీబీఐ అధికారులు పులివెందులలోని పాదరక్షల దుకాణం యజమాని మున్నాను, కడప స్టేషన్ మాస్టర్ మోహన్ రెడ్డిని కూడా విచారించారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ విచారణకు వివేకా డ్రైవర్ దస్తగిరి, సుంకేశులకు చెందిన ఉమాశంకర్ రెడ్డి కూడా హాజరయ్యారు.
CBI
YS Vivekananda Reddy
Murder Case
Sunil Yadav
Pulivendula
Kadapa District
Andhra Pradesh

More Telugu News