Corona Eta: బ్రిటన్ లో గుర్తించిన కరోనా 'ఈటా' వేరియంట్ ఇప్పుడు భారత్ లో కూడా!

  • వేగంగా రూపాంతరం చెందుతున్న కరోనా
  • తెరపైకి ఈటా వేరియంట్
  • మంగళూరులో ఓ వ్యక్తికి నిర్ధారణ
  • ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి
Corona Eta Variant identified in India

కరోనా మహమ్మారి మరో కొత్త రూపు దాల్చింది. బ్రిటన్ లో ఇటీవలే కరోనా ఈటా వేరియంట్ ను గుర్తించగా, ఇప్పుడీ నూతన రకం భారత్ లోనూ వెలుగు చూసింది. కర్ణాటకలోని మంగళూరులో ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా, ఈటా వేరియంట్ నిర్ధారణ అయింది.

ఆ వ్యక్తి ఇటీవల దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చినట్టు గుర్తించారు. అయితే అతడు కొన్నిరోజులకే కోలుకున్నాడు. అతడి నుంచి సేకరించిన నమూనాలకు డీఎన్ఏ సీక్వెన్సింగ్ జరిపారు. దాంతో కరోనా రూపాంతరం చెందిన విషయం వెల్లడైంది. అతడితో సన్నిహితంగా ఉన్న గ్రామస్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

భారత్ లో సెకండ్ వేవ్ సమయంలో కరోనా డెల్టా వేరియంట్ విజృంభించింది. పెద్ద ఎత్తున వ్యాపించడంతో పాటు, భారీగా మరణాలకు కారణమైంది. ఆపై డెల్టా ప్లస్ వేరియంట్ గా రూపాంతరం చెందినా, దాని వల్ల ముప్పు తక్కువేనని పరిశోధకులు భావిస్తున్నారు.

More Telugu News