Sonu Sood: గ్రామీణ ప్రయాణికుల కోసం 'ట్రావెల్ యూనియన్' ప్లాట్ ఫాంను ఆవిష్కరించిన సోనూ సూద్

Sonu Sood launches Travel Union for rural people
  • దాతృత్వానికి కేరాఫ్ అడ్రెస్ గా సోనూ సూద్
  • కరోనా వేళ విస్తృత సేవలు
  • తాజాగా గ్రామీణ ప్రయాణికులపై దృష్టి
  • విభిన్న ప్రయాణ సేవలు అందించేలా కొత్త వేదిక
కరోనా సంక్షోభ సమయంలో లోక రక్షకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు సోనూ సూద్ గ్రామీణ ప్రయాణికులపై దృష్టి సారించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ట్రావెల్ యూనియన్ ప్లాట్ ఫాంను ఆవిష్కరించారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉండే ఈ ప్లాట్ ఫాం త్వరలోనే మరో 11 భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది. విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు, ప్రైవేటు ట్రావెల్స్, టూరిస్ట్ బస్ సర్వీసులు, హోటల్ సదుపాయాలను ఈ వేదిక ద్వారా గ్రామీణ వినియోగదారులు పొందవచ్చు.

నగరాల్లోని ట్రావెల్ ఏజెన్సీలను, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ట్రావెల్ ఏజెన్సీలను ఈ ట్రావెల్ యూనియన్ వేదిక ద్వారా అనుసంధానం చేయాలన్నది దీని వెనకున్న ఆలోచన. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థలు అసంఘటితంగా ఉన్న విషయాన్ని గుర్తించిన సోనూ సూద్, ఆయా ట్రావెల్ ఏజెన్సీల భాగస్వామ్యంతో ఈ వేదికను తీసుకువచ్చారు.
Sonu Sood
Travel Union
Rural India
Platfarm

More Telugu News