బాలకృష్ణ చేతుల మీదుగా 'నమః శివాయ' సాంగ్ రిలీజ్

06-08-2021 Fri 11:48
  • నాట్య ప్రధానమైన కథ
  • సంధ్యారాజుకి తొలి సినిమా
  • సంగీత దర్శకుడిగా శ్రవణ్ భరద్వాజ్
  • కీలకపాత్రలో భానుప్రియ  
Natyam song released by Balakrishna
సంధ్యారాజు ప్రధాన పాత్రధారిగా 'నాట్యం' సినిమా రూపొందింది. ఆమె ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి. అందువల్లనే నాట్య ప్రధానమైన కథను ఎంచుకుని ఈ సినిమాను చేశారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, భానుప్రియ .. శుభలేఖ సుధాకర్ .. కమల్ కామరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

కొంతకాలం క్రితం ఉపాసన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రిలీజ్ చేయగా, అందరి దృష్టి ఈ సినిమాపైకి వెళ్లింది. ఆ తరువాత టీజర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి 'నమః శివాయ' అనే పాటను బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

నాయకా నాయికలు ఒక ఉత్సవంలో భాగంగా శివాలయంలో స్వామివారి సన్నిధిలో నాట్యం చేసే సందర్భంలో వచ్చే పాట ఇది. లేపాక్షి ఆలయంలో చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. సంధ్యా రాజు నాట్యభంగిమలు .. హావభావాలు హైలైట్ గా నిలిచాయి. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం మనసుకు పట్టేదిలా ఉంది. 'నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం' అన్నట్టుగానే ఈ పాట సాగింది.