​​రేపు తిరుమలలో సమావేశం కానున్న స్పెసిఫైడ్ అథారిటీ​​​​​​​​​​​

05-08-2021 Thu 21:31
  • ముగిసిన టీటీడీ బోర్డు పదవీకాలం
  • ఇద్దరు సభ్యులతో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు
  • సభ్యులుగా టీటీడీ ఈవో, అదనపు ఈవో
  • రేపు ఉదయం 11 గంటలకు అన్నమయ్య భవన్ లో భేటీ
Specified Authority will meet in Tirumala

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఇద్దరు సభ్యుల స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. పాలనా వ్యవహారాల కోసం స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటైంది. ఈ స్పెసిఫైడ్ అథారిటీలో టీటీడీ ఈఓ, అదనపు ఈవో సభ్యులుగా ఉంటారు. తిరుమలలో రేపు స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం కానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు అన్నమయ్య భవన్ లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించనున్నారు.