పాకిస్థాన్ లో మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన అరాచక శక్తులు

05-08-2021 Thu 14:30
  • భోంగ్ నగరంలో ఘటన
  • కర్రలు, రాడ్లతో వచ్చిన దుండగులు
  • వినాయక ఆలయంలో వీరంగం
  • విగ్రహాల ధ్వంసం
Mob vandalizes another Hindu temple in Pakistan

పాకిస్థాన్ లో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి. మరో హిందూ దేవాలయంపై దాడి చేసిన దుండగులు, ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, నిప్పు పెట్టారు. రహీంయార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలను పాకిస్థాన్ హిందూ నేత, పార్లమెంటు సభ్యుడు రమేశ్ కుమార్ వంక్వానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కర్రలు, రాడ్లు చేతబూని వినాయక ఆలయంలోకి చొరబడిన ఓ మూక, విగ్రహాలను నాశనం చేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్న దృశ్యాలను ఆ వీడియోల్లో చూడొచ్చు. అనంతరం, సమీపంలోని రోడ్డును దిగ్బంధించి వీరంగం వేశారు. దీనిపై రమేశ్ కుమార్ స్పందిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎంతో నిదానంగా వచ్చారని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వెల్లడించారు.