Dhanush: చట్టానికి ఎవరూ అతీతులు 'కారు'... తమిళ హీరో ధనుష్ పై హైకోర్టు ఆగ్రహం

Madras High Court denies hero Dhanush request on tax waive
  • రోల్స్ రాయిస్ కారు దిగుమతి చేసుకున్న ధనుష్
  • పన్ను మినహాయింపు కోరుతూ పిటిషన్
  • విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు
  • పన్ను కట్టేందుకు ఇబ్బందేంటన్న ధర్మాసనం
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తు వాహనాలకు పన్నులు చెల్లించేందుకు ప్రముఖులు మినహాయింపులు కోరుతుండడం, కొన్నిసార్లు పన్ను ఎగవేతకు పాల్పడుతుండడం తరచుగా మీడియాలో దర్శనమిస్తోంది. ఇటీవల తమిళ హీరో విజయ్ కూడా ఇలాంటి వ్యవహారంలోనే కోర్టుతో మొట్టికాయలు తిన్నాడు. తాజాగా మరో తమిళ హీరో ధనుష్ కూడా తన ఫారెన్ కారుకు పన్ను మినహాయింపు కోరి, హైకోర్టు ఆగ్రహానికి గురయ్యాడు.

ధనుష్ 2015లో విలాసవంతమైన రోల్స్ రాయిస్ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఆ లగ్జరీ కారుకు పన్ను మినహాయింపు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ధనుష్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ధనుష్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యులే పన్నులు కడుతున్నప్పుడు మీకేంటి ఇబ్బంది? అంటూ ప్రశ్నించింది. మీరు కొనుగోలు చేసింది లగ్జరీ కారు... పన్ను మినహాయించాలని ఎలా అడుగుతున్నారు? అంటూ నిలదీసింది.

చట్టానికి ఎవరూ అతీతులు కారని, పన్ను చెల్లించాల్సిందేనని ధనుష్ కు తేల్చిచెప్పింది. దాంతో, ధనుష్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఇప్పటికే సగం పన్ను చెల్లించామని, మిగతా మొత్తాన్ని ఈ నెల 9న చెల్లిస్తామని కోర్టుకు వివరణ ఇచ్చారు.
Dhanush
Foreign Car
Tax
Madras High Court

More Telugu News