Vinesh Phogat: టోక్యో ఒలింపిక్స్: రెజ్లింగ్ ప్రీ క్వార్టర్స్ లో అదరగొట్టిన వినేశ్ ఫొగట్

  • క్వార్టర్ ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్
  • మహిళల 53 కేజీల విభాగంలో స్వీడన్ రెజ్లర్‌పై భారీ విజయం
  • 9 గంటలకు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్
Vinesh Phogat defeats Swedens Sofia Mattsson enters quarter final

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అదరగొట్టింది. మహిళల 53 కేజీల విభాగం ప్రీక్వార్టర్స్‌లో స్వీడన్ రెజ్లర్ మ్యాట్‌సన్‌ సోఫియాను 7-1 తేడాతో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఫొగాట్ చివరి వరకు అదే ఊపు కొనసాగించింది. క్వార్టర్ ఫైనల్‌లో ఫొగాట్ బెలారస్‌ రెజ్లర్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కూడా ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. కాగా, కాంస్య పతకం కోసం జర్మనీతో జరుగుతున్న పోరులో భారత జట్టు నాలుగో క్వార్టర్‌లో 5-4తో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరికొన్ని నిమిషాల పాటు భారత జట్టు డిఫెన్స్ చేయగలిగితే భారత్‌కు కాంస్య పతకం ఖాయమైనట్టే.

More Telugu News