ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు: 145 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

04-08-2021 Wed 21:06
  • భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్
  • హడలెత్తించిన టీమిండియా సీమర్లు
  • షమీకి 3, బుమ్రాకు 2 వికెట్లు
  • రూట్ అర్ధ సెంచరీ
England lost six wickets in Trent Bridge

ఇంగ్లండ్ తో తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ను కకావికలం చేశారు. మహ్మద్ షమీ (3/23), జస్ప్రీత్ బుమ్రా (2/35) ధాటికి ఇంగ్లండ్ 145 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ కు ఓ వికెట్ దక్కింది. లంచ్ తర్వాత డాన్ లారెన్స్, జోస్ బట్లర్ డకౌట్ కావడంతో ఇంగ్లండ్ కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ జో రూట్, ఆల్ రౌండర్ శామ్ కరన్ ఉన్నారు. రూట్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.