ఐ-టీడీపీ వెబ్ సైట్ ను ప్రారంభించిన నారా లోకేశ్

  • కార్యకర్తల కోసం ప్రత్యేక వెబ్ సైట్
  • కార్యకర్తలకు అన్ని విధాలా సాయం
  • వాట్సాప్ లింకు ద్వారా సమాచారం అందించాలన్న లోకేశ్
  • న్యాయసహాయం అందిస్తామని వెల్లడి
Nara Lokesh launches ITDP website for party workers

సోషల్ మీడియాలో నిత్యం క్రియాశీలకంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఓ వెబ్ సైట్ (https://itdpblog.com) ను రూపొందించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పార్టీకి అండగా నిలిచే కార్యకర్తలకు దన్నుగా నిలిచేందుకు ఈ వెబ్ సైట్ ను తీసుకువచ్చారు. ఈ ఐ-టీడీపీ వెబ్ సైట్ ను ఇవాళ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించారు.

సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై పోలీసుల నుంచి గానీ, వైసీపీ నుంచి గానీ ఇబ్బందులు ఎదురైతే వెబ్ సైట్ లో ఉండే వాట్సాప్ లింకు ద్వారా సమాచారం అందించాలని లోకేశ్ కార్యకర్తలకు సూచించారు. తద్వారా పార్టీ వెంటనే స్పందించి న్యాయసహాయం అందిస్తుందని, అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తుందని వివరించారు.

More Telugu News