ప్ర‌తి కోచ్ నుంచి చాలా నేర్చుకుంటా: పీవీ సింధు

04-08-2021 Wed 10:59
  • ప్యారిస్ ఒలింపిక్స్‌-2024లో త‌ప్ప‌కుండా ఆడ‌తా
  • ప్ర‌తి కోచ్ వ‌ద్ద ప్ర‌త్యేక నైపుణ్యాలు, టెక్నిక్స్ ఉంటాయి
  • వారి నుంచి నేర్చుకోవాల్సినదంతా నేర్చుకోవడం చాలా ముఖ్యం
  • నాకు శిక్ష‌ణను ఇచ్చిన కోచ్‌లు అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నా
Currently Im enjoying the moment cherishing it PV Sindhu

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన హైద‌రాబాదీ పీవీ సింధు ఢిల్లీకి చేరుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... తాను ప్యారిస్ ఒలింపిక్స్‌-2024లో త‌ప్ప‌కుండా ఆడ‌తాన‌ని చెప్పింది. ఆ ఒలింపిక్స్‌లో సాధ్య‌మైనంత మేర బాగా ఆడ‌తాన‌ని తెలిపింది. ప్ర‌స్తుతం తాను టోక్యో ఒలింపిక్స్ విజ‌యాన్ని ఎంజాయ్ చేస్తున్నాన‌ని, కాంస్య ప‌త‌కం సాధించినందుకు సంతోషంగా ఉంద‌ని చెప్పారు.

టోక్యో ఒలింపిక్స్ కోసం పీవీ సింధు కొత్త కోచ్ వ‌ద్ద శిక్ష‌ణ తీసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై సింధు స్పందిస్తూ... ప్ర‌తి కోచ్ నుంచి తాను చాలా నేర్చుకుంటాన‌ని చెప్పింది. ప్ర‌తి కోచ్ వ‌ద్ద ప్ర‌త్యేక నైపుణ్యాలు, టెక్నిక్స్ ఉంటాయ‌ని తెలిపింది. వారి నుంచి నేర్చుకోవాల్సినదంతా నేర్చుకోవడం చాలా ముఖ్య‌మ‌ని చెప్పింది. త‌న‌కు శిక్ష‌ణను ఇచ్చిన కోచ్‌లు అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని తెలిపింది. ఈ సారి నైపుణ్యాలు, టెక్నిక్స్ పై దృష్టి పెట్ట‌డానికి త‌న‌కు కావాల్సినంత స‌మ‌యం దొరికింద‌ని చెప్పింది.