దత్తత గ్రామం వాసాలమర్రికి నేడు కేసీఆర్

04-08-2021 Wed 08:24
  • గ్రామ సర్పంచ్‌కు స్వయంగా ఫోన్ చేసి చెప్పిన కేసీఆర్
  • రైతు వేదికలో 130 మందితో సమావేశం
  • జూన్ 22న గ్రామంలో పర్యటించి గ్రామస్థులతో సహపంక్తి భోజనం
KCR Today visit Vasalamarri Village

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేడు తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పర్యటించనున్నారు. తాను గ్రామానికి వస్తున్నట్టు ముఖ్యమంత్రి స్వయంగా నిన్న అధికార యంత్రాంగానికి, గ్రామ సర్పంచ్ ఆంజనేయులుకు ఫోన్ చేసి చెప్పారు. పర్యటనలో భాగంగా రైతు వేదికలో 130 మందితో సమావేశం అవుతారు. గతంలో ఆయన ఇచ్చిన హామీల అమలును సమీక్షిస్తారు. జూన్ 22న గ్రామంలో పర్యటించిన కేసీఆర్ ఈ సందర్భంగా గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గ్రామాభివృద్ధికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో నేడు మరోమారు గ్రామానికి వెళ్తున్న కేసీఆర్ తన హామీల అమలును పర్యవేక్షించనున్నారు.