ఇది హిందువులు, బీజేపీ కార్యకర్తలు, ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన విజయం: సోము వీర్రాజు

03-08-2021 Tue 15:19
  • ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని కలెక్టర్ ఆదేశించారు
  • ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
  • రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ఎమ్మెల్యే రాచమల్లు కుట్రలు భగ్నమయ్యాయి
This is Hindus victory says Somu Veerraju

కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి కుట్రలను భగ్నం చేస్తూ బీజేపీ చేసిన పోరాటాల ఫలితంగా అక్కడ విగ్రహం ఏర్పాటు చేయకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారని వీర్రాజు పేర్కొన్నారు.

ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారని తెలిపారు. ఇది, హిందువులు, బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన గొప్ప విజయమని వీర్రాజు అన్నారు.