ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల తేదీ ఇదే!

03-08-2021 Tue 15:01
  • ఆగస్ట్ 15న ఓలా స్కూటర్ల విడుదల
  • జులై 15న ప్రారంభమైన బుకింగ్ లు
  • 10 రంగుల్లో జనాల ముందుకు వస్తున్న స్కూటర్లు
Ola scooters to deliver on 15th August

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎప్పుడు మార్కెట్లోకి విడుదల అవుతాయా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జులై 15న ఓలా స్కూటర్ బుకింగ్ లు ప్రారంభమయ్యాయి. రూ. 499తో ఈ స్కూటర్లను బుక్ చేసుకునే అవకాశాన్ని ఓలా కల్పించింది. బుకింగ్ లు ప్రారంభమైన 24 గంటల్లోనే ఏకంగా లక్షకు పైగా బుకింగ్ లు జరిగాయి. మొత్తం 10 రంగుల్లో ఈ స్కూటర్లు వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. ఈ రంగులను కూడా ఓలా ఇప్పటికే విడుదల చేసింది.

మరోవైపు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న స్కూటర్లను విడుదల చేస్తున్నామని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ప్రకటించారు. స్కూటర్ ఫీచర్లు, బుక్ చేసుకున్న వారికి అవి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే వివరాలను ఆరోజే వెల్లడించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మన దేశంలోనే ఈ స్కూటర్లను తయారు చేస్తున్నారు. ఈ స్కూటర్లపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.