విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడండి... ఢిల్లీలో ప్లకార్డులు చేతబూనిన వైసీపీ ఎంపీలు

02-08-2021 Mon 14:44
  • విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • కేంద్రం పునరాలోచించుకోవాలంటున్న పోరాట కమిటీ
  • మద్దతు పలికిన వైసీపీ ఎంపీలు
  • ధర్నాలో పాల్గొన్న విజయసాయి తదితరులు
YCP MPs chants save Vizag Steel in Delhi

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం కృతనిశ్చయంతో ఉండగా, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఢిల్లీలో ధర్నా చేపడుతోంది. ఈ ధర్నాకు వైసీపీ ఎంపీలు మద్దతు పలికారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసే నిర్ణయం పట్ల కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని వారు నినాదాలు చేశారు. విజయసాయిరెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకటరమణ, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ ఈ ధర్నాలో పాల్గొన్నారు. "సేవ్ వైజాగ్ స్టీల్" అంటూ ప్లకార్డులు చేతబూని నినదించారు.