KCR: నాకు కూడా కరోనా వచ్చింది.. అందుకే ఇక్కడకు రావడం ఆలస్యమైంది: కేసీఆర్

  • హాలియాను అద్భుతంగా తీర్చిదిద్దుతాం
  • సాగర్ నియోజకవర్గ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం
  • నియోజకవర్గానికి రూ. 150 కోట్లు ఇస్తాం
I too got affected with Corona says KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించారు. సాగర్ సమీపంలో ఉన్న హాలియాలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ... హాలియాను అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సాగర్ నియోకజవర్గంలో ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని... అన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

నందికొండ మున్సిపాలిటీలో ఉన్న ఇళ్లన్నింటినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ. 15 కోట్ల చొప్పున నిధులు ఇస్తానని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి రూ. 150 కోట్లు ఇస్తానని చెప్పారు. తాను కూడా కరోనా బారిన పడ్డానని... అందుకే హాలియాకు రావడం ఆలస్యమైందని చెప్పారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. త్వరలోనే గుర్రంపోడు లిఫ్ట్ పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. దీంతోపాటు నెల్లికల్ లిఫ్ట్, దేవరకొండలో ఐదు లిఫ్ట్ లు, మిర్యాలగూడలో ఐదు లిఫ్ట్ లు, నకిరేకల్ అయిటిపాముల వద్ద ఒక లిఫ్ట్ లతో కలిపి నల్గొండ జిల్లాకు మొత్తం 15 లిఫ్ట్ లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ లిఫ్టులన్నింటినీ ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తామని, జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు.

More Telugu News