తెలంగాణలో మరో 455 మందికి కరోనా

01-08-2021 Sun 20:54
  • గత 24 గంటల్లో 83,763 కరోనా పరీక్షలు
  • 500కి దిగువన కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 648 మంది
  • ముగ్గురి మృతి
Telangana corona cases update

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 83,763 కరోనా టెస్టులు నిర్వహించగా, 455 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 648 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,45,406 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,32,728 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,873 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనా మృతుల సంఖ్య 3,805కి చేరింది.
.