రూ.50 వేల లోపు రైతు రుణాల మాఫీకి తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం

01-08-2021 Sun 17:57
  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
  • రైతు రుణమాఫీపై చర్చ
  • 6 లక్షల మంది రైతులకు లబ్ది
  • ఆగస్టు 15 నుంచి రుణమాఫీ
Telangana cabinet key decisions on loan waiver

తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో రైతు రుణ మాఫీలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది రూ.50 వేల లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నుంచి నెలాఖరులోపు రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తీర్మానించారు. తెలంగాణ మంత్రి మండలి తీసుకున్న రుణమాఫీ నిర్ణయంతో 6 లక్షల మంది రైతులకు ప్రయోజనం దక్కనుంది.

అటు, కేంద్రం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తెలంగాణలో అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ కింద ఐదేళ్ల సడలింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.