శభాష్ సింధు... టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం కైవసం
- చైనా షట్లర్ పై నెగ్గిన సింధు
- 21-13, 21-16తో సింధు జయభేరి
- టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం
- నిన్న సెమీఫైనల్లో ఓడిన సింధు
నిన్న జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు... చైనీస్ తైపేకి చెందిన వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓటమిపాలవడం తెలిసిందే. అయితే, కాంస్యం కోసం పోరులో నెగ్గి కోట్లాది భారతీయుల ముఖాల్లో సింధు ఆనందం నింపింది. కాగా, వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజతం నెగ్గిన తర్వాత భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో ఇది రెండో పతకం.