Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెరిగిన సందర్శకుల తాకిడి

  • శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
  • నీటిని దిగువకు విడుదల
  • 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తిన వైనం
  • ఘాట్ రోడ్డుపై నిలిచిన వందలాది వాహనాలు
Visitors rush at Srisailam project

శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో 10 గేట్లను ఎత్తారు. గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే, గేట్లను ఎత్తిన నేపథ్యంలో, నీరు దిగువకు దూకుతున్న దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు. దాంతో ఇక్కడి ఘాట్ రోడ్డుపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు కదిలేందుకు గంటల కొద్దీ సమయం పడుతోంది. శ్రీశైలం-హైదరాబాదు రోడ్డుపైకి అడ్డదిడ్డంగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

కాగా, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరగడంతో ఇక్కడ కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరిన్ని గేట్లు ఎత్తేందుకు సాగర్ డ్యామ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

More Telugu News