Lal Darwaja: సందడిగా లాల్​ దర్వాజ.. ప్రముఖులు తరలివచ్చిన వేళ

  • తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులు
  • పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
  • సింహవాహిని అమ్మవారికి విజయశాంతి బోనం
  • అమ్మవారిని దర్శించుకున్న మహమూద్ అలీ, తలసాని, సంజయ్ రేవంత్
Huge Number Of Devotees Queued in For Lal Darwaja Bonalu

హైదరాబాద్ పాత బస్తీ బోనాల పండుగతో కళకళలాడుతోంది. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగవైభోగంగా సాగుతున్నాయి. 113వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు బోనాలు తీసుకుని తండోపతండాలుగా అక్కడికి తరలివస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులూ బోనాలు సమర్పించారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో లాల్ దర్వాజ బోనాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. బోనాలకు ప్రభుత్వమే నిధులు కేటాయిస్తోందన్నారు. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అమ్మవారిని దర్శించుకున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేతలతో కలిసి విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పార్టీ నేతలున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.

More Telugu News