ఏపీలో కొత్తగా 2,058 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 78,992 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 364 కేసులు
- కర్నూలు జిల్లాలో 11 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో 23 మంది మృతి
అదే సమయంలో 2,053 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 13,377 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,66,175 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,31,618 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 21,180 మందికి చికిత్స జరుగుతోంది.