దళితులపై దాడి వెనుక చంద్రబాబు పాత్ర కూడా ఉంది: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్

31-07-2021 Sat 16:22
  • ఉమ కుటుంబానికి బాబు పరామర్శ
  • ఉమ దళితులపై దాడి చేశారంటున్న వైసీపీ నేతలు
  • చంద్రబాబు పరామర్శించడమేంటని ఆగ్రహం
  • చంద్రబాబు పాములా పగబట్టారని వ్యాఖ్యలు
YCP MP Nandigam Suresh fires on Chandrababu

దళితులపై దాడికి పాల్పడిన దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రావడం దుర్మార్గమని వైసీపీ ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. దళితులపై దాడి వెనుక చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ, చంద్రబాబు దళితద్రోహి అని మరోసాని నిరూపితమైందని అన్నారు. దళితులపైనే దాడి జరిగితే, దాడి చేసిన వారిని పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడించారన్న కక్ష కట్టిన టీడీపీ దళితులపై దాడులకు దిగుతోందని ఆరోపించారు. చంద్రబాబు దళితులపై ఓ పాములా పగబట్టారని విమర్శించారు.