Nayanthara: కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన నయనతార

Nayanatara enter into new business
  • 'చాయ్ వాలే'లో నయనతార పెట్టుబడులు
  • ఆమెతో పాటు, ఆమె ప్రియడు విఘ్నేశ్ కూడా పెట్టుబడులు పెట్టిన వైనం
  • ఏడాది లోపల 35 స్టోర్లను తెరవాలనేదే కంపెనీ లక్ష్యం
ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పలు వ్యాపారాల్లో అడుగుపెట్టడం చూస్తూనే ఉన్నాం. రియలెస్టేట్ తో పాటు పలు వ్యాపారాల్లో వారు పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార కొత్త బిజినెస్ లో అడుగుపెట్టింది. చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్ 'చాయ్ వాలే' లో ఆమె పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ సంస్థకు రూ. 5 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇందులో నయన్, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ ల పెట్టుబడులు కూడా ఉన్నాయి.

'చాయ్ వాలే' బిజినెస్ విషయంలోకి వెళ్తే... ఈ సంస్థ దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఫంక్షనల్ స్టోర్లను తీసుకొస్తోంది. ఏడాది లోపల పూర్తిగా పని చేసే 35 స్టోర్లను తెరవాలనేది కంపెనీ ప్రణాళిక అని సమాచారం. ఈ సంస్థలో పలువురు సినీ ప్రముఖులు పెట్టుబడి పెట్టారు. మరోవైపు నయన్, విఘ్నేశ్ కాంబినేషన్లో ప్రస్తుతం 'కాతు వాకుల రెండు కాదల్' అనే సినిమా తెరకెక్కుతోంది.
Nayanthara
New Business
Investment

More Telugu News