కాసేపట్లో సింధు సెమీఫైనల్ మ్యాచ్.... అన్ని జిల్లాల కలెక్టర్లకు 'శాప్' విజ్ఞప్తి

31-07-2021 Sat 14:44
  • టోక్యో ఒలింపిక్స్ లో నేడు సింధు వర్సెస్ తై జు యింగ్
  • బ్యాడ్మింటన్ లో సెమీఫైనల్ సమరం
  • తనకన్నా మెరుగైన ర్యాంకర్ తో పోటీ
  • డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్న శాప్
PV Sindhu set face semifinal hurdle in Tokyo Olympics

ఇవాళ టోక్యో ఒలింపిక్స్ లో తెలుగుతేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ తో అమీతుమీకి సింధు సిద్ధమైంది ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ఏపీలో అన్ని ప్రముఖ ప్రదేశాల్లో, మున్సిపాలిటీ కూడళ్లు, సినిమా థియేటర్లలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. సింధు మ్యాచ్ ను క్రీడాభిమానులు తిలకించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.