అసోం, మిజోరం మధ్య మరింత పెరిగిన సరిహద్దుల రగడ.. సీఎం హిమంతపై క్రిమినల్ కేసు
- ఇటీవల సరిహద్దుల్లో ఘర్షణ
- మిజోరంలో కేసులు
- నలుగురు అసోం పోలీసు అధికారులపై కేసులు
- ఇద్దరు పరిపాలన అధికారులపై కూడా
- మిజోరం సరిహద్దుల వద్దకు వెళ్లకూడదని పౌరులకు అసోం సూచన
ఏకంగా అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై మిజోరంలో క్రిమినల్ కేసు నమోదైంది. అలాగే, అసోంకు చెందిన నలుగురు పోలీసు అధికారులు, ఇద్దరు పరిపాలన అధికారులపై కూడా మిజోరం పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, భద్రత రీత్యా మిజోరం సరిహద్దుల వద్దకు ఎవరూ వెళ్లకూడదని తమ పౌరులకు అసోం ప్రభుత్వం సూచన చేసింది. అసోం ప్రజలను రెచ్చగొట్టే విధంగా మిజోరం విద్యార్థి సంఘాలు వ్యవహరిస్తున్నాయని చెప్పింది. మిజోరంకి రాకపోకలు కొనసాగించకూడదని తెలిపింది.