ఆదివారం సమావేశం కానున్న తెలంగాణ క్యాబినెట్

30-07-2021 Fri 21:44
  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ
  • మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం
  • ప్రగతిభవన్ వేదికగా మంత్రివర్గ సమావేశం
  • కీలక అంశాలు చర్చించనున్న మంత్రిమండలి
Telangana cabinet meet on Sunday

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ఆదివారం సమావేశం కానుంది. హైదరాబాదులోని ప్రగతిభవన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ ప్రారంభం అవుతుంది. ప్రధానంగా దళిత బంధు అమలు, వ్యవసాయ అంశాలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యవహారం, కరోనా పరిస్థితులు, ఏపీతో జల వివాదాలు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించే అంశాన్ని ఎల్లుండి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయించే అవకాశాలున్నాయి. అటు, 50 వేల ఉద్యోగాల భర్తీ అంశాన్ని కూడా క్యాబినెట్ లో చర్చిస్తారని భావిస్తున్నారు.