చంద్రబాబు తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా పనిచేస్తున్నట్టుంది: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యంగ్యం

30-07-2021 Fri 16:38
  • చీఫ్ విప్ మీడియా సమావేశం
  • చంద్రబాబుపై విమర్శలు
  • బాబు తెలంగాణ ప్రాజెక్టులను సమర్థిస్తున్నాడని ఆరోపణ
  • కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని వెల్లడి
YCP Leader Srikanth Reddy slams Chandrababu
ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు తాజాగా తెలంగాణ ప్రాజెక్టులను సమర్థిస్తూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే తెలంగాణ నీటిపారుదల శాఖకు సలహాదారుగా వ్యవహరిస్తున్నట్టుగా ఉందని అన్నారు.

వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు 14 ఏళ్లు పాలిస్తే 12 ఏళ్లు కరవు తాండవించిందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉంటే చంద్రబాబు కళ్లలో నీళ్లు వస్తాయని, రైతులు ఆనందంగా ఉంటే చంద్రబాబుకు కడుపుమంట అని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

జలవివాదాలపై వివరణ ఇస్తూ... కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ మాత్రం అక్రమ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోందని ఆరోపించారు.