Kiara: శంకర్ సినిమాలో బాలీవుడ్ భామ ఫిక్సయిందట!

Kiara Advani finalized for Shankar movie
  • శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా 
  • పాన్ ఇండియా మూవీగా నిర్మాణం
  • జోరుమీదున్న ప్రీ ప్రొడక్షన్ పనులు
  • కథానాయికగా కియారా ఖరారు
గతంలో హీరోహీరోయిన్ల కాంబినేషన్లు ఎక్కువగా రిపీట్ అవుతూ ఉండేవి. వాళ్ల కాంబోలో ఒక సినిమా హిట్టయితే, ఆ వెంటనే మరికొన్ని సినిమాలు వాళ్ల కాంబినేషన్లో వచ్చేసేవి. అయితే, నేటితరం హీరోలు మాత్రం సినిమా సినిమాకీ హీరోయిన్ ని మార్చేస్తున్నారు. పైగా, ఎక్కువమంది హీరోయిన్లు అందుబాటులో ఉండడంతో ఎప్పటికప్పుడు మరో కాంబినేషన ని చూసుకుంటున్నారు. అందుకే, హీరో హీరోయిన్ల కాంబోలు రిపీట్ అవడం ఇటీవలి కాలంలో తక్కువగా చూస్తున్నాం.
 
ఈ క్రమంలో మెగా హీరో రామ్ చరణ్ బాలీవుడ్ భామ కియారా అద్వానీతో కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. ఆమధ్య 'వినయ విధేయ రామ' సినిమాలో చరణ్, కియారా జోడీ కలసి నటించింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలసి నటించే అవకాశం వచ్చింది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ తన తాజా చిత్రాన్ని చేయనున్నాడు. ఇది  చరణ్ కు 15వ సినిమా. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర విషయంలో ఇప్పటివరకు రకరకాల పేర్లు వినిపించాయి. అయితే, తాజాగా కియారా ఎంపిక ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తాడని కూడా వార్తలొస్తున్నాయి. అలాగే ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం.
Kiara
Charan
Shankar

More Telugu News