'ఆచార్య' అప్డేట్ కోసం వెయిట్ చేయవలసిందేనట!

30-07-2021 Fri 10:33
  • ముగింపు దశలో 'ఆచార్య'
  • త్వరలో షూటింగు పార్టు పూర్తి
  • మణిశర్మ సంగీతం హైలైట్
  • చిరూ బర్త్ డే నుంచి అప్ డేట్స్  
Acharya movie shooting update

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' రూపొందుతోంది. కరోనా కారణంగా చాలా రోజులుగా ఆగిపోయిన షూటింగు ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం ప్రధాన పాత్రల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తికానుంది.

అయితే చరణ్ .. పూజ హెగ్డే కాంబినేషన్లో చిత్రీకరించిన సాంగ్ లిరికల్ వీడియో రావొచ్చుననే టాక్ తాజాగా వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదనేది సన్నిహిత వర్గాల మాట. చరణ్ - పూజ హెగ్డే పాట మాత్రమే కాదు, ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తయ్యేవరకూ ఎలాంటి అప్ డేట్స్ వదలకూడదనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

బహుశా చిరంజీవి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్టు 22న అప్ డేట్ ఉండొచ్చని అంటున్నారు. ఆ తరువాత నుంచి ఇక వరుసగా అప్ డేట్స్ వదిలే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. సందేశంతో పాటు వినోదం కలగలిసిన ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.