శ్రీలంకతో మూడో టీ20: టాస్ గెలిచిన టీమిండియా

29-07-2021 Thu 19:54
  • కొలంబో వేదికగా మ్యాచ్
  • బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • టీమిండియాలో సందీప్ వారియర్ కు చోటు
  • 1-1తో సమవుజ్జీలుగా భారత్, శ్రీలంక
Team India won the toss against Sri Lanka

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్, శ్రీలంక చెరో మ్యాచ్ నెగ్గి సమవుజ్జీలుగా నిలిచాయి. నేటి మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

టీమిండియా పేసర్ నవదీప్ సైనీ గాయపడడంతో సందీప్ వారియర్ జట్టులోకి వచ్చాడు. ధావన్ కు జతగా రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలున్నాయి. అటు, లంక జట్టులో లెఫ్టార్మ్ సీమర్ ఇసురు ఉదన బదులు పథుమ్ నిశాంక తుదిజట్టులోకి వచ్చాడు.