ఏపీపీఎస్సీ ద్వారా 1,180 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి

29-07-2021 Thu 17:54
  • నిరుద్యోగులకు శుభవార్త
  • రెవెన్యూ, ఆయుష్ తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీ
  • తాజా ఉద్యోగాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వర్తింపు
  • ఆర్థికశాఖ ఆదేశాలు
AP Finance dept gives nod to APPSC to new recruitment

ఉద్యోగ నియామకాల అంశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ ద్వారా 1,180 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి మంజూరు చేసింది. ఆయుష్, రెవెన్యూ విభాగాలతో పాటు, పలు శాఖల్లోని ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ నియామకాల్లో భాగంగా రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా, జూన్ 18 నాటి ప్రకటనకు అనుబంధంగా తాజా ఉద్యోగాలను కూడా జాబ్ క్యాలెండర్ లో చేర్చాలని ఆర్థికశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేయాలని స్పష్టం చేసింది.