ఏపీలో రోజువారీ కొవిడ్ కేసుల వివరాలు ఇవిగో!

29-07-2021 Thu 17:39
  • గత 24 గంటల్లో 78,784 కరోనా పరీక్షలు
  • 2,107 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో 20 మంది కన్నుమూత
  • ఇంకా 21,279 మందికి చికిత్స
AP covid cases and deaths

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 78,784 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,107 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 392 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 316 కేసులు, కృష్ణా జిల్లాలో 303 కేసులు వెల్లడయ్యాయి. నెల్లూరు జిల్లాలో 242, ప్రకాశం జిల్లాలో 200 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 1,807 మంది కరోనా నుంచి కోలుకోగా, 20 మంది మరణించారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే ఆరుగురు కరోనాతో కన్నుమూశారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,332కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు 19,62,049 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,27,438 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 21,279 మందికి చికిత్స జరుగుతోంది.