'తిమ్మరుసు' జనంలోకి వెళ్లడానికి కారణం ఎన్టీఆర్: సత్యదేవ్

29-07-2021 Thu 17:38
  • రేపు రిలీజ్ కానున్న 'తిమ్మరుసు'
  • లాయర్ పాత్రలో సత్యదేవ్
  • ఒక కేసు చుట్టూ తిరిగే కథ
  • హిట్టుపై హీరో నమ్మకం  
Thimmarusu is going to release tomorrow

సత్యదేవ్ కథానాయకుడిగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో 'తిమ్మరుసు' రూపొందింది. మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా, రేపు థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. కరోనా లాక్ డౌన్ తరువాత థియేటర్లు తెరుచుకోగానే వస్తున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి సత్యదేవ్ మాట్లాడాడు. "ఇప్పటివరకూ నేను చేస్తూ వచ్చిన సినిమాలకు భిన్నంగా 'తిమ్మరుసు' ఉంటుంది. ఒక కేసు నుంచి ఒక సామాన్యుడిని రక్షించడం కోసం, ఒక సాధారణమైన లాయర్ ఏం చేశాడనేదే కథ. ఆ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందనేది ఊహకందని విధంగా ఉంటుంది .. ఉత్కంఠను పెంచుతుంది.

ఈ సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ రిలీజ్ చేశారు .. ఆ ట్రైలర్ కి 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా ఇంతగా జనంలోకి వెళ్లడానికి కారణం ఆయనే. అందుకే నేను ఎన్టీఆర్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే అనుకుంటున్నాను. తదుపరి ప్రాజెక్టులుగా 'గుర్తుందా శీతాకాలం' .. 'గాడ్సే' .. 'స్కైలాబ్' ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు.