Ram Gopal Varma: ఒకసారి అయ్యాక కూడా నీకింకా బుద్ధి రాలేదా?: సుమంత్ పెళ్లి వార్తపై ఆర్జీవీ

Ram Gopal Varma reaction on Sumanths second marriage
  • రెండో పెళ్లి చేసుకోబోతున్న సుమంత్
  • 2004లో కీర్తిరెడ్డిని తొలి వివాహం చేసుకున్న వైనం
  • నీ ఖర్మ అంటూ కామెంట్ చేసిన వర్మ
సినీ నటుడు సుమంత్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. పవిత్ర అనే యువతిని ఆయన పెళ్లాడబోతున్నారు. ఇప్పటికే పెళ్లి కార్డులు పంచడం కూడా ప్రారంభమయిందని తెలుస్తోంది. వీరి పెళ్లిపత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ నటి కీర్తిరెడ్డిని 2004లో సుమంత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు.

మరోవైపు సుమత్ మళ్లీ పెళ్లి చేసుకోనుండటంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. 'ఒక సారి అయ్యాక కూడా నీకింకా బుద్ధి రాలేదా సుమంత్? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ. అనుభవించండి' అని ట్వీట్ చేశాడు.
Ram Gopal Varma
Sumanth
Second Marriage

More Telugu News