Deveneni Uma: దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్

Devineni Uma sent to 14 days remand

  • హనుమాన్ జంక్షన్ పీఎస్ నుంచి జూమ్ యాప్ ద్వారా కోర్టు విచారణ
  • దేవినేని ఉమపై 12 సెక్షన్ల కింద కేసు నమోదు
  • రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి జూమ్ యాప్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆయనకు 14 రోజుల రిమాండును కోర్టు విధించింది. మరోవైపు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఆరోపణలపై నిన్న రాత్రి ఆయన పరిశీలనకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో జి.కొండూరు మండలం గడ్డమణుగ వద్ద ఆయనను కొందరు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. అయితే కావాలనే దేవినేని ఉమ అలజడి సృష్టించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దేవినేనిపై పోలీసులు 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News