Lok Sabha: మాణికం ఠాగూర్ తో పాటు 10 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన లోక్ సభ స్పీకర్

  • పార్లమెంటును కుదిపేస్తున్న పెగాసస్, వ్యవసాయ చట్టాలు
  • స్పీకర్ ఛైర్ పైకి పేపర్లు విసిరిన విపక్ష ఎంపీలు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోక్ సభ స్వీకర్
10 MPs suspended from Lok Sabha

పెగాసస్ స్పైవేర్, వ్యవసాయ చట్టాలు తదితర అంశాలు పార్లమెంటు ఉభయసభలను కుదిపేస్తున్నాయి. ఈ అంశాలపై చర్చను నిర్వహించాలంటూ విపక్షాలు పట్టుబడుతూ, ఆందోళనకు దిగుతున్నాయి. వెల్ లోకి వెళ్లి ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు లోక్ సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీలు కొందరు స్పీకర్ ఛైర్ పైకి పేపర్లు విసిరేశారు. ఈ ఘటన పట్ల లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్లు విసిరిన వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు.

సస్పెన్షన్ కు గురైన వారిలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ తో పాటు డీన్ కురియకోజ్, హిబ్బి హిడన్, జోయిమని, రవనీత్ బిట్టు, గుర్జీత్ ఔజ్లా, వైథిలింగం, ప్రతాపన్, సప్తగిరి శంకర్, ఏఎం ఆరిఫ్, దీపక్ బైజ్ లు ఉన్నారు. రూల్ 374 (2) ప్రకారం వీరిని సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. మరోసారి ఇలా ప్రవర్తిస్తే లోక్ సభ టర్మ్ మొత్తం బహిష్కరిస్తామని హెచ్చరించారు.

More Telugu News