నెల్లూరులో రూ. 50 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్

28-07-2021 Wed 08:38
  • ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 50 లక్షలతో బయలుదేరిన వ్యాన్
  • ఏటీఎం వద్ద సిబ్బంది కిందికి దిగిన వెంటనే పరారీ
  • గాలిస్తున్న పోలీసులు
ATM Van Driver run away with Rs 50 Lakhs in Nellore

నెల్లూరు జిల్లాలో ఓ ఏటీఎం వ్యాన్ డ్రైవర్ రూ. 50 లక్షలతో పరారయ్యాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటీఎంలలో నగదు నింపే సెక్యూర్ వ్యాలీ క్యాష్ ఏజెన్సీలో పోలయ్య డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 50 లక్షల నగదు తీసుకుని ఏటీఎంలలో నింపేందుకు ఏజెన్సీ సిబ్బంది బయలుదేరారు.

 ఓ ఏటీఎం వద్ద సిబ్బంది కిందికి దిగిన వెంటనే ఇదే అదునుగా భావించిన వ్యాన్ డ్రైవర్ పోలయ్య.. నగదు ఉన్న పెట్టతో వ్యాన్‌తో సహా ఉడాయించాడు. సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే అక్కడి నుంచి పరారయ్యాడు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న పోలయ్య కోసం గాలిస్తున్నారు.