ధనుశ్ మూవీ నుంచి రేపు ఫస్టులుక్!

27-07-2021 Tue 17:27
  • కార్తీక్ నరేన్ నుంచి మరో చిత్రం
  • ధనుశ్ కి 43వ సినిమా
  • రేపే ఉదయం 11 గంటలకు రిలీజ్
  • మాళవిక మోహనన్ కి ఛాన్స్  
Dhanush first look will release tommorow

తమిళ యువ దర్శకులలో కార్తీక్ నరేన్ కి మంచి పేరు ఉంది. కథ .. స్క్రీన్ ప్లే విషయంలో ఆయనకి మంచి పట్టు ఉంది. ఇంతకుముందు ఆయన చేసిన 'ధురువంగల్ పతినారు' సినిమా అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ను నరేన్ బాగా తెరకెక్కించగలడు అనే పేరు తెచ్చుకున్నాడు. అలాంటి నరేన్ ఇప్పుడు ధనుశ్ కథానాయకుడిగా ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.  

కెరియర్ పరంగా ఇది ధనుశ్ కి ఇది 43వ సినిమా. ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేశారుగానీ, బయటికి చెప్పలేదు. టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను రేపు రిలీజ్ చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఫస్టులుక్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ధనుశ్ సరసన నాయికగా మాళవిక మోహనన్ ను తీసుకున్నారు.

ఇటీవల కాలంలో ధనుశ్ ప్రయోగాత్మక పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమాలు ఆయన క్రేజ్ ను మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అందరితోనూ ఆసక్తి ఉంది. ఫస్టులుక్ తోనే ధనుశ్  ఏ స్థాయిలో అంచనాలు పెంచుతాడో చూడాలి మరి.