అందుకే ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీ ‘దళిత-గిరిజన దండోరా’: వీడియో పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి

27-07-2021 Tue 13:04
  • టీఆర్‌ఎస్‌ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరా
  • భూమి కోసం ‘బాంఛెన్ కాల్మొక్తా’ అని ఇప్పటికీ గిరిజనులు వేడుకుంటున్నారు
  • ఈ పరిస్థితిని ప్రశ్నించేందుకే ఆగస్టు 9న దండోరా
revanth reddy slams kcr

టీఆర్‌ఎస్‌ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరా మోగించడానికి సన్నద్ధమవుతోన్న విష‌యం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర స‌ర్కారు చే‌సిన‌ వంచనను ఎండగడ‌తామ‌ని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈ క్రమంలో ఆగస్టు 9 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్‌ 17 వరకు పల్లెపల్లెకు తిరిగి ‘దళిత, గిరిజన దండోరా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

దీనిపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మ‌రోసారి స్పందించారు. తాము ఎందుకు ఈ కార్య‌క్రమాన్ని చేప‌డుతున్నామో ఓ వీడియో ద్వారా వివ‌రించారు. భూమి కోసం ‘బాంఛెన్ కాల్మొక్తా’ అని ఇప్పటికీ గిరిజనం వేడుకుంటోన్న దృశ్యాలు కనిపిస్తోన్న స్వరాష్ట్రం. ఈ పరిస్థితిని ప్రశ్నించేందుకే నాడు క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీ ‘దళిత-గిరిజన దండోరా’కు శంఖారావం పూరిస్తోంది. ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ప్రశ్నించే గొంతుక నినదించబోతోంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.