Dean Boxall: తన శిష్యురాలు స్వర్ణం గెలవడంతో పూనకం వచ్చినట్టు ఊగిపోయిన ఆస్ట్రేలియా స్విమ్మింగ్ కోచ్... వీడియో వైరల్

Australia swimming coach celebration in Tokyo Olympics went viral
  • టోక్యో ఒలింపిక్స్ లో పసిడి గెలిచిన ఆసీస్ స్విమ్మర్
  • 400 మీ ఫ్రీస్టయిల్ ప్రథమస్థానంలో అరియానే టిట్మస్
  • గ్యాలరీలో సంబరాలు చేసుకున్న కోచ్ డీన్ బాక్సాల్
  • హడలిపోయిన ఒలింపిక్స్ సిబ్బంది
టోక్యో ఒలింపిక్స్ లో ఆసక్తికర ఘటన జరిగింది. మహిళల స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ పోటీల్లో ఆస్ట్రేలియాకు చెందిన అరియానే టిట్మస్ స్వర్ణం సాధించింది. ఆమె ఫినిషింగ్ లైన్ తాకడంతోనే గ్యాలరీలో ఉన్న ఆమె కోచ్ డీన్ బాక్సాల్ పూనకం వచ్చినవాడిలా ఊగిపోయాడు. తన శిష్యురాలు పసిడి సాధించిందన్న ఆనందం ఆయనలో కట్టలు తెంచుకుంది. కేకలు, అరుపులతో గ్యాలరీలో హంగామా సృష్టించాడు. బాక్సాల్ ఉద్రేకాన్ని చూసి అక్కడే ఉన్న ఓ ఒలింపిక్స్ ఉద్యోగి హడలిపోయింది. ఆ ఊపులో ఎక్కడ గ్యాలరీ నుంచి కిందికి దూకేస్తాడేమోనని ఆమె చేతులు అడ్డుపెట్టే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికలపై వైరల్ అవుతోంది.
Dean Boxall
Swimming Coach
Ariane Titmus
Gold
400m Free Style
Tokyo Olympics
Viral Videos

More Telugu News