పార్వతీపురంలో వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న గుజరాత్ యువతులు

25-07-2021 Sun 20:44
  • ఇటీవల గుంటూరు వద్ద ఘటన
  • అదే తరహాలో విజయనగరం జిల్లాలోనూ వసూళ్లు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వాహనదారులు
  • 24 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Gujarath girls collects money at Parvathipuram

ఇటీవల గుంటూరు జిల్లాలో కొందరు అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు ధరించి రోడ్డుపై వచ్చే వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేయగా, ఆ అమ్మాయిలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఇప్పుడదే తరహాలో విజయనగరం జిల్లా పార్వతీపురం శివార్లలో రోడ్లపై కొందరు అమ్మాయిలు వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేశారు.

దీనిపై వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు 24 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారు గుజరాత్ కు చెందిన వారని గుర్తించారు. అయితే వారికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోవడంతో, వారిని అహ్మదాబాద్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.